సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్యాంబాబు

సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్యాంబాబు

* 9.88 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.

* టిడిపి ప్రభుత్వంలో ఆరోగ్యానికి పెద్దపీట.

* పత్తికొండ శాసనసభ్యులు కే.ఈ శాంబాబు.

పత్తికొండ/తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: తెలుగుదేశం ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేసిందని పత్తికొండ శాసనసభ్యులు కేఈ శాంబాబు తెలియజేశారు.మంగళవారం రోజున నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు అనారోగ్యంతో చికిత్స పొంది సీఎం రిలీఫ్ ఫండ్ కొరకు దరఖాస్తు చేసుకున్న బాధితులకు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నిధులు అందిస్తున్నారన్నారు. పత్తికొండ నియోజకవర్గం పరిధిలోని గల 10మందికి తొమ్మిది లక్షల 88 వేల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన అందజేశారు.తుగ్గలి మండల పరిధిలోని గల పెండేకల్ గ్రామానికి చెందిన అనసూయమ్మ కు ఎమ్మెల్యే శ్యాంబాబు,పెండేకల్ గ్రామ మాజీ సర్పంచ్ బర్మా వీరేష్ లు 59,350 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు.అదేవిధంగా బొల్లవానిపల్లి గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి కు 1,05,343 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ కష్ట కాలంలో తమకు ఆర్థిక సహాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు మరియు ఎమ్మెల్యే కే.ఈ శ్యాంబాబు కు లబ్ధిదారులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తుగ్గల మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!