నేడు మండలానికి వచ్చేయనున్న ఎమ్మెల్యే వీరుపాక్షీ
హొళగుంద, న్యూస్ వెలుగు: నేడు మండలంలోని వన్నూరు క్యాంప్ మరియు సమ్మతగేరి గ్రామాలకు ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి విచేస్తున్నట్లు సోమవారం వైసిపి మండల కన్వీనర్ షఫీయుల్లా తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్నూర్ క్యాంపులో ఉదయం:-11 గంటలకు పర్యటిస్తారు.అనంతరం సమ్మతగేరి గ్రామంలో జరిగే దేవర కార్యక్రమానికి హాజరవుతారన్నారు.కావున మండల వైసిపి సీనియర్ నాయకులు,మండల కో-కన్వీనర్,జెడ్పిటిసి, మండల వైస్ ఎంపీపీ,మండల యూత్,అన్ని గ్రామాల ఎంపీటీసీలు,సర్పంచులు,సచివాలయ కన్వీనర్లు,బూత్ కమిటీ మెంబర్లు,వార్డు మెంబర్లు,పార్టీ అనుబంధ విభాగాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
Was this helpful?
Thanks for your feedback!