ఇంటర్నెట్ డెస్క్ : గత 10 సంవత్సరాలలో భారతదేశం మొబైల్ మరియు ఎలక్ట్రానిక్స్ తయారీలో గణనీయమైన పురోగతిని సాధించింది. ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రి అశ్విని ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో మాట్లాడుతూ, 2014లో కేవలం 2 మొబైల్ తయారీ యూనిట్లు మాత్రమే ఉన్నాయని; నేడు దేశంలో 300 యూనిట్లకు పైగా ఉన్నాయని అన్నారు. మొబైల్ ఫోన్ తయారీ విలువ 2014 ఆర్థిక సంవత్సరంలో 18 వేల 9 వందల కోట్ల రూపాయల నుండి 2024 ఆర్థిక సంవత్సరం నాటికి 4 లక్షల 22 వేల కోట్ల రూపాయలకు గణనీయంగా పెరిగిందని శ్రీ వైష్ణవ్ అన్నారు. ఎగుమతులు కూడా 1 లక్ష 29 వేల కోట్ల రూపాయలను దాటాయని ఆయన అన్నారు. గత దశాబ్దంలో భారతదేశంలో మొబైల్ ఫోన్ తయారీ 12 లక్షల ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలను సృష్టించిందని మంత్రి హైలైట్ చేశారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం స్వావలంబనను నడిపిస్తుందని, ఉత్పత్తిని పెంచుతుందని మరియు ఉద్యోగాలను సృష్టిస్తుందని శ్రీ వైష్ణవ్ పేర్కొన్నారు.
