వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి పట్టని మోడీ గో బ్యాక్

వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి పట్టని మోడీ గో బ్యాక్

మాటల గారడీ మాకొద్దంటూ సిపిఎం ర్యాలీ ధర్నా

న్యూస్ వెలుగు, కర్నూల్; రాష్ట్ర అభివృద్ధి పట్టని మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ.. సిపిఎం రాష్ట్ర కమిటి ఇచ్చిన పిలుపు లో భాగంగా సిపిఎం కర్నూలు జిల్లా కమిటి ఆధ్వర్యంలో మంగళవారం కర్నూలు నగరం లోని జిల్లా పరిషత్ ఆవరణం నుండి రాజ్ విహార్, మెడికల్ కళాశాల మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ ముందు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
ర్యాలీ లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విభజన హామీలు అమలు చేయాలి, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి పట్టదా, మోడీ గో బ్యాక్ అంటూ పెద్ద పెట్టున నినదించారు.
సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి యం రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి నిర్మల, టి రాముడు మాట్లాడారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం పేరుతో రేపు రాష్ట్రానికి రాబోతున్న నరేంద్ర మోడీ, రాష్ట్ర ప్రజానీకానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2014 ఎన్నికలకు ముందు విభజన హామీలను అమలు చేస్తామన్న హామీతో బాబు మోడీ జోడి ప్రజల ముందుకు వచ్చి అధికారాన్ని కైవసం చేసుకున్న తర్వాత 11 ఏళ్లు అయినా హామీలు అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. నాడు రాజధాని శంకుస్థాపన కోసమని వచ్చి చెంబుడు నీళ్లు పిడికెడు మట్టి వేసి వెళ్ళారని, హామీలు అమలు చేయకుండా ఇంకెన్నెళ్లు మోసం చేస్తారని వారు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి అప్పిచ్చే స్థాయికి ఎదిగిన విశాఖ ఉక్కును, గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టి, ప్రైవేట్ కార్పొరేట్ల ఆదాయ వనరు కోసం ఏకంగా మూసివేతకు ప్లాన్ వేసిందన్నారు. విశాఖ ఉక్కు రక్షణ పట్ల స్పష్టత ఇవ్వాలన్నారు. వెనకబడ్డ రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ కేటాయించి ప్రాజెక్టులు నిర్మించాల్సిన పాలకులు ఒక్కటంటే ఒక్కటి కూడా నిర్మించలేదన్నారు. తిరిగి నేడు కూటమి ప్రభుత్వం లో భాగంగా చంద్రబాబు మోడీలు జోడి ఉన్నారని, రాష్ట్ర వెనుకబాటు తనానికి సంబంధించి చంద్రబాబు కూడా సమాధానం చెప్పాలన్నారు. 142 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి 165 లక్షల కోట్ల అప్పులు పెట్టి దేశాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. చేసిన అప్పు అంత ఏ అభివృద్ధి కోసం ఖర్చు చేశారో ప్రజానీకానికి సమాధానం చెప్పాలన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, రాయలసీమ ముఖ ద్వారమైన కర్నూలు జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం, వలసల నియంత్రణ లాంటి వాటిపై దృష్టి పెట్టకుండా మాటల గారడీ మాకొద్దని ముక్తకంఠంతో మీ రాకను వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించకపోతే ప్రజలంతా ఐక్యంగా తిరగబడే రోజు మరెంతో దూరంలో లేదని వారు హెచ్చరించారు.
నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, జి రామకృష్ణ, కె వెంకటేశ్వర్లు, కెవి నారాయణ, ఎండి ఆనంద్ బాబు, ఎండి అంజిబాబు, జిల్లా కమిటీ సభ్యులు అలివేలమ్మ, అరుణమ్మ, నగేష్, గురుశేఖర్, విజయ్, లింగన్న, వీరశేఖర్, హనుమంతు, నాగన్న, బాలకృష్ణ, సీనియర్ నాయకులు పుల్లారెడ్డి, నగరాల కార్యదర్శి వర్గ సభ్యులు సాయిబాబా నరసింహులు సుధాకరప్ప షరీఫ్ రామకృష్ణ అబ్దుల్లా ప్రభాకర్ మరో 200 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!