సింగపూర్ మ్యాథ్స్ ఒలంపియాడ్లో మాంటిస్సోరి విద్యార్థులు ప్రతిభ
న్యూస్ వెలుగు, కర్నూలు; పాఠశాల విద్యార్థులలో దాగివున్న అపార మేధా సంపతిని వెలికితీసి, విద్యార్థులను పరిశోధన వైపు ప్రోత్సహించటానికి ఏటా ఒలింపియాడ్ ఇంటర్నేషనల్ సంస్థవారు ‘సింగపూర్ మ్యాథ్స్ ఛాలెంజ్’ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం నిర్వహించిన పరీక్షలలో ఏ-క్యాంప్ మాంటిస్సోరి పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న జి.జతిన్, 8వ తరగతి చదువుతున్న డి. తౌషిక్ అద్భుత ప్రతిభ కనబరిచి వచ్చే సంవత్సరం జులైలో సింగపూర్లో జరుగబోయే సింగపూర్ మ్యాథ్స్ గ్లోబల్ ఫైనల్-2025′ కు ఎన్నిక కాబడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా 43 దేశాల విద్యార్థులు ఇందులో పాల్గొనగా టాప్-20లో ఇండియా నుండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుండి మాంటిస్సోరి విద్యార్థులు ఇద్దరు ఎంపిక కావడం గమనార్హం. ఈ సందర్భంగా వీరిని మాంటిస్సోరి విద్యా సంస్థల డైరెక్టర్ కె. రాజశేఖర్, ప్రధానోపాధ్యాయులు రమాజ్యోతి , కో-ఆర్డినేటర్ సుబ్బారెడ్డి అభినందించారు.