17 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేయాలి : ముఖ్యమంత్రి చంద్రబాబు

17 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేయాలి : ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి న్యూస్ వెలుగు : గృహనిర్మాణ శాఖ, APTIDCO సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 3 లక్షలకు పైగా ఇళ్లను పూర్తి చేసి సామూహిక గృహప్రవేశాలు చేయించిన ప్రభుత్వం రానున్న మూడేళ్లలోనూ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. రానున్న మూడేళ్ల కాలంలో 17 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించేలా కార్యాచరణ చేపట్టాలని టిడ్కో, గృహ నిర్మాణ శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వైద్యారోగ్య శాఖపై సచివాలయంలో సిఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్శల్ హెల్త్ స్కీం చర్చ జరిగింది. సంజీవని ప్రాజెక్టు స్కీంను జనవరి నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నారు.ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని వారు వెల్లడించారు. పీపీపీ ప్రాతిపదికన తొలివిడతలో చేపట్టనున్న ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణంపై చర్చించారు. పీపీపీ విధానంలో వేగంగా బోధనాసుపత్రులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు వివరించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS