నర్సింగ్ సిబ్బందికి మోటీవేషన్ స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం
కర్నూలు, న్యూస్ వెలుగు; ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సి.ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఓల్డ్ లెక్చర్ గ్యాలరీ నందు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మోటీవేషన్, స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం లో భాగంగా శనివారం నర్సింగ్ సిబ్బందికి మన యొక్క వృత్తిని, ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి, ఎలా మెరుగుపరుచుకోవాలి, మన ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు మెరుగైన వైద్యం ఎలా అందించాలి మరియు కోవిడ్ నుంచి బయటపడిన తర్వాత మనం ఫ్యూచర్ లో ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం ద్వారా నర్సింగ్ సిబ్బందికి మోటివేషన్ ఇచ్చుటకై వచ్చిన మోటువేషన్ స్పీకర్ అయిన డా.బ్రహ్మారెడ్డి కి ప్రత్యేకంగా ఆహ్వానించి వారి యొక్క సందేశం ఇవ్వడం జరిగింది అని అన్నారు.
డాక్టర్ బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలకు అందించడానికి ఆసుపత్రి నర్సింగ్ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులకు మోటివేషన్ అనేది నర్సింగ్ సిబ్బంది చాలా ఉపయోగకరమని నర్సింగ్ సూపర్డెంట్ సావిత్రిబాయి అన్నారు.. అనంతరం పేషెంట్లకు సేవ చేయడంలో నర్సింగ్ స్టాఫ్ పాత్ర చాలా కీలకమైందని అని అన్నారు. వైద్యంలో నర్సింగ్ సిబ్బంది మరియు పారామెడికల్ సిబ్బంది అందరూ కలిసినప్పుడే డాక్టర్ గొప్పవాడు అప్పుడే వైద్యం చేయగలడు అని అన్నారు. మన దగ్గరికి ఎందరో పేషెంట్లు సమస్యలతో వస్తారు అప్పటికే వాళ్లు సమస్యలతో సతమతము అయ్యుంటారని వారిని కోపపడకుండా కోపాన్ని నివారించుకొని వారికి నవ్వుతూ పలకరిస్తూ సమాధానం చెప్పినప్పుడు సగం సమస్య పరిష్కారం అవుతుంది అని అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జన విజ్ఞాన వేదిక సభ్యులు మరియు డా.బ్రహ్మారెడ్డి, ఆసుపత్రి డిప్యూటీ సి ఎస్ ఆర్ ఎమ్ ఓ, డా.హేమనలిని, డిప్యూటీ సివిల్ సర్జన్ డా.వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, నర్సింగ్ సూపరింటెండెంట్, శ్రీమతి.సావిత్రి బాయి, మరియు నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.ప్రభాకర రెడ్డి తెలిపారు.