13న కర్నూలుకు తరలిరండి
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: డిసెంబర్ 13న రైతు సమస్యల పై కర్నూల్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేయాలని వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు తుగ్గలి మండలానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు,వైయస్సార్సీపి సర్పంచులు,ఎంపీటీసీలు,ఎంపీపీ, జడ్పిటిసి లు అందరూ 13వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు కర్నూల్ పట్టణంలోని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఇంటి వద్దకు రావలసిందిగా వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జిట్ట నాగేష్ తెలిపారు. రైతుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం పై వైఎస్ఆర్సిపి సభ్యులందరూ గళం విప్పాలని ఆయన తెలియజేశారు.
Was this helpful?
Thanks for your feedback!