
గోవాలో పర్యటించిన స్టాండింగ్ కమిటీ
కర్నూలు, న్యూస్ వెలుగు; వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గురువారం గోవాలో పర్యటించారు .. ఈ పర్యటన లో స్టాండింగ్ కమిటీ సభ్యుడైన కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు..ఇందులో భాగంగా కమిటీ చైర్మన్ కనిమొళి కరుణానిధి అధ్యక్షత న సభ్యులు బ్యాంకర్ల తో సమావేశం నిర్వహించి, బ్యాంకింగ్ రంగంలో వినియోగదారుల హక్కులను కాపాడడం అనే అంశం పై చర్చించారు.. ఈ సమావేశంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ, ఆర్థిక సేవల విభాగం మరియు ప్రధాన బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు..
Was this helpful?
Thanks for your feedback!