
పార్లమెంటులో గళం ఏది ఎంపీలు
రాష్ట్రంలో రేషన్ ఇసుక మాఫియా
న్యూస్ వెలుగు, కర్నూలు; పార్లమెంటులో చాలామంది ఆంధ్రప్రదేశ్ కు చెందిన పార్లమెంట్లు సభ్యులు గళం ఇవ్వడం లేదని కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తూరు సత్యనారాయణ గుప్త విమర్శించారు. సోమవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో జరగాల్సిన అభివృద్ధి వెనకబడిన ప్రాంతాల జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ గురించి బలంగా వినిపించకపోవడం బాధాకర విషయం అన్నారు .గత కొద్ది రోజులుగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న టిడిపి గానే జనసేన గాని బిజెపి ఎంపీలు గాని నోరు మెదపకుండా ఉండటం ఏంటని ఆయన ప్రశ్నించారు. చివరికి వైసిపి ఎంపీలు కూడా ప్రశ్నించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు .ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీలు ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపిస్తే కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా నిధులు తీసుకురాకుండా మౌనంగా ఉండటం ఏంటని ఆయన ప్రశ్నించారు.
కాకినాడ నుండి విదేశాలకు తరలిపోతున్న రేషన్ బియ్యాన్ని అడ్డుకునే యంత్రాంగం మరింత పటిష్టంగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు . అయితే కాకినాడకు వెళ్లి అక్రమ బియ్యం రవాణా అవుతున్న షిప్ లోకి వెళ్లాలి అంటే వద్దు అని ఆపారని పవన్ కళ్యాణ్ చెప్పడం వెనుక ఎవరు అని ఆయన ప్రశ్నించారు. ఉపముఖ్యమంత్రిని ఆపేశక్తి ఆపై స్థాయిలో ఉన్న వారికి సాధ్యమని వారు ఎవరో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తే రేషన్ కార్డు దారులు తీసుకుంటారని, అదేవిధంగా అక్రమ రవాణా జరుగుతున్న తీరు వారి వెనక ఉన్న వారు ఎవరో కూడా రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
కర్నూల్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని మీడియాలో కథనాలు వస్తున్న వాటిపై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించలేదన్నారు. జిల్లా ఉన్నతాధికారులు హెచ్చరికలు చేయడమే తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం ఇసుక మాఫియా పెట్టెకు పోతుందని ఆయన విమర్శించారు.