నగరపాలక రూ.61.22 కోట్ల పన్ను వసూళ్లు

నగరపాలక రూ.61.22 కోట్ల పన్ను వసూళ్లు

* నెలాఖరుకు 100% శాతం పన్నులు వసూలు చేస్తాం

* నగరపాలక మేనేజర్ యన్.చిన్నరాముడు వెల్లడి

నగరపాలక సంస్థ; కర్నూలు, న్యూస్ వెలుగు; ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నగరపాలక ఆస్తి, నీటి పన్నులను రూ.61.22 కోట్లు వసూలు అయినట్లు నగరపాలక కార్యాలయ మేనేజర్ యన్.చిన్నరాముడు అన్నారు. ఆదివారం ఆయన కార్యాలయంలోని పన్ను వసూలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‌ నగరపాలక ప్రధాన ఆదాయ వనరైన పన్నుల వసూళ్లు నగరంలో విసృతంగా సాగుతోందని, సెలవు దినమైన ఆదివారం రోజు సైతం రెవెన్యూ, సచివాలయ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ చేపట్టారని వివరించారు. 2024-2025 వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.55.96 కోట్ల ఆస్తి పన్నులు, రూ.5.26 కోట్ల తాగునీటి చార్జీలను వసూలు చేయడం జరిగిందన్నారు. ఈ నెలాఖరులోగా 100% శాతం పన్నులను వసూలు చేస్తామని, నగరపాలకకు ప్రజలు సహకరించాలని మేనేజర్ కోరారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్లు రామక్రిష్ణ, రామక్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS