
జీవన్ ప్రమాణ ప్రభుత్వ యాప్ ద్వారా తప్పనిసరిగా సమర్పించాలి
కర్నూలు, న్యూస్ వెలుగు; జీవన ప్రమాణ ధృవీకరణ పత్రాలు సమర్పించుటకు చివరి తేది: 28, ఫిబ్రవరి, 2025.ప్రభుత్వ పించనుదారులు ఈ నెల 28లోగా (28.02.2025) జీవన్ ప్రమాణ ధృవీకరణ పత్రాలు ఖజాన కార్యాలయంలో జీవన్ ప్రమాణ్ ప్రభుత్వ యాప్ ద్వారా గాని తప్పని సరిగా సమర్పించాలని జిల్లా ఖజాన అధికారి శ్రీ.బి. రామచంద్రరావు తెలిపారు.కర్నూలు జిల్లాలో 18,707 పించాన్దారులకుగాను 15,701 మంది జీవన్ ప్రమాణ్ ధృవీకరణ పత్రాలు సమర్పించారన్ని ఇంకా 3,006 మంది ఇవ్వవలసిందని తెలియజేశారు. కదలలేని పించన్దారులు వివరాలు తెలియజేసినచో, ఖజానా సిబ్బంది ద్వారా ఫించన్దారు ఇంట్టి వద్దనే జీవన్ ప్రమాణ్ ధృవీకరణ పత్రాన్ని ప్రభుత్వ యాప్ ద్వారా అందిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. పించనుదారుల సమస్యలపై సంఘలతో జిల్లా ఖజానా కార్యాలయములో సమావేశము నిర్వహించి పించనుదారుల సమస్యలపై తగు చర్యలు తీసుకొంటామని తెలియజేశారు.