రాష్ట్ర, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోన్న నాబార్డ్: చీఫ్ విప్ జీవీ
విఠంరాజుపల్లిలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, గ్రామ సంత ప్రారంభోత్సవం
న్యూస్ వెలుగు, వినుకొండ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, దేశ అభివృద్ధిలో నాబార్డు కీలక పాత్ర పోషిస్తోందన్నారు ప్రభుత్వచీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. ఇప్పటి వరకు రోడ్లు వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఎక్కడ అవసరమైతే అక్కడ రుణాలు ఇచ్చిన నాబార్డు, ఇప్పుడు రైతులకు ఉపయోగపడే కూర గాయల మార్కెట్ వంటివాటికి కూడా ఆర్థికసాయం అందించడం గొప్ప విషయంగా పేర్కొన్నా రు. వినుకొండ మండలం విఠంరాజుపల్లి గ్రామంలో కొత్తగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, గ్రామ సంత ప్రాంగణాన్ని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్‌విప్ జీవీ గ్రామంలోని ఎన్టీఆర్ పార్క్ స్థలంలో నాబార్డ్, పంచాయతీ నిధులతో రైతుల కోసం సంత ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. చుట్టుపక్కల గ్రామాల రైతులు పండించిన కూరగాయలు ఇక్క డ పెట్టుకుని అమ్ముకుంటే వారికి, ప్రజలకూ మేలు జరుగుతుందన్నారు. భవిష్యత్‌లో నాబార్డు వారు కూడా ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేవి, చిరు వ్యాపారులకు అండగా ఉండే ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రం నుంచి అనేక పథకాలకు సబ్సిడీ రుణాలు అందిస్తున్నారన్నారు. కేంద్ర పథకాలు – సబ్సిడీ రుణాలపై వినుకొండ నియోజకవర్గంలోని 200గ్రామాల ప్రజలకు సమాచారం, సహకారం అందించడానికి ఎంపీ లావు కార్యాలయం నుంచి ఒకరిని తమకోసం కేటాయించాలని కోరారు. అనంతరం మాట్లాడిన ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు జిల్లాలో ఇలా నాబార్డు సాయంతో కూరగాయల మార్కెట్ నిర్మించు కోవడం ఇదే మొదటిసారి అన్నారు. నాబార్డు వైపు నుంచి చేయించుకోవాల్సిన చాలా ఉన్నాయి. ప్రజలు, స్థానిక నాయకులు ఉత్సాహంతో ఉంటే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చని సూచించారు. ఇదే సమయంలో ప్రజాజీవితంలో ఎంత ఉన్నతస్థానాలకు ఎదిగిన ఎక్కడి నుంచి వచ్చామో అక్కడి సమస్యలపై గుర్తు పెట్టుకుని పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. తానూ, జీవీ ఆ విషయం ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటామన్నారు.ఇంకా విదశాఖల ప్రభుత్వ అధికారులు మాజీ శాసనసభ్యులు ముక్కిన మల్లికార్జున రావు, నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కొనిజేటి నాగ శ్రీను రాయల్, టిడిపి నాయకులు వజ్రాల కృష్ణారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.