
రాష్ట్ర ప్రత్యేక బహుమతి సాధించిన యస్టి జోసెఫ్ స్కూల్ విద్యార్థి నేసే రుత్విక్
పత్తికొండ, న్యూస్ వెలుగు; నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండ పట్టణంలోని యస్టి జోసెఫ్ స్కూల్ విద్యార్థి నేసే రుత్విక్ అబాకస్ మరియు వేదిక్ ఓలంపియాడ్ 2026 రాష్ట్ర స్థాయి ప్రత్యేక బహుమతి సాధించినట్లు ప్రధానోపాధ్యాయురాలు జస్టి తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ ఈనెల ఇరవై రెండో తేది ఆదివారం కడప నగరం బాలాజీ నగర్ లోని శ్రీహరి డిగ్రీ కళాశాలలొ
రైజింగ్ నాలెడ్జ్ సంస్థ రాష్ట్ర అధికారులు అబాకస్ మరియు వేదిక్ ఓలంపియాడ్ 2026 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు నిర్వహించారన్నారు. ఈ పోటీ పరీక్షలలో రెండో తరగతి విద్యార్థి నేసే రుత్విక్ రాష్ట్ర స్థాయి ప్రత్యేక బహుమతి సాధించినట్లు ఆమె తెలిపారు. రైజింగ్ నాలెడ్జ్ సంస్థ రాష్ట్ర అధికారులు పంపిన ప్రశంసా పత్రాన్ని, జ్ఞాపికను, మెడల్ ను ఆమె విద్యార్థి నేసే రుత్విక్ కి బహూకరించి, శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు. అబాకస్ మరియు వేదిక్ ఉపాధ్యాయురాలు లక్ష్మి, లీలావతి, ఇందు, సుజాత మరియు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థి నేసే రుత్విక్ కి శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు.

