మరో నలుగురిని అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐ‌ఏ

మరో నలుగురిని అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐ‌ఏ

డిల్లీ న్యూస్ వెలుగు : ఢిల్లీ ఎర్రకోట ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద ఘటనలో ప్రమేయం ఉన్న మరో నలుగురు ప్రధాన నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్టు చేసింది. ఢిల్లీ కోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ నుండి నలుగురు నిందితులను తమ సంస్థ అదుపులోకి తీసుకున్నట్లు NIA ఒక ప్రకటనలో తెలిపింది. నిందితులను జమ్మూ కాశ్మీర్‌కు చెందిన డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గనై, డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్ మరియు ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్ వాగే మరియు ఉత్తరప్రదేశ్‌కు చెందిన డాక్టర్ షాహీన్ సయీద్‌గా NIA గుర్తించింది. ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఇప్పుడు ఆరుకు పెరిగింది.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS