
అభివృద్ధి పనులను ప్రారంభించిన అధికారులు,ప్రజా ప్రతినిధులు
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండలం పరిధిలోని రాంపల్లి గ్రామంలో పత్తికొండ శాసన సభ సభ్యులు కెయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు “పల్లె పండుగ-పంచాయతీ వారోత్సవాలు” కార్యక్రమంలో భాగంగా మండల టిడిపి కన్వీనర్ ఆర్ తిరుపాలు నాయుడు, రాంపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యులు ఆర్ శ్రీనివాసులు ఆద్వర్యంలో మండల ఎపీఓ హేమ సుందర్,ఈసి ప్రదీప్, టెక్నికల్ అసిస్టెంట్ జయరాం, ఫీల్డ్ అసిస్టెంట్ హేమాద్రి నాయుడు,రాంపల్లి గ్రామ రైతు జయన్నకు సంబంధించిన ఉపాధి హామీ గ్రామీణ పథకంలో భాగంగా నూతనంగా నిర్మించిన గోకులం షెడ్డుకు పూజా కార్యక్రమాలు చేసి ప్రారంభించారు.అదే విధంగా ముక్కేళ్ళ గ్రామంలోని గ్రామ సర్పంచ్ సలహా దారులు రామచంద్ర ఆద్వర్యంలో గోకులం షెడ్డును మండల అధికారులు ప్రారంభించారు.అదేవిధంగా జొన్నగిరి గ్రామం నందు నూతనంగా నిర్మించిన గోకులం షెడ్డును ఎంపీడీవో విశ్వ మోహన్,విద్యా కమిటీ చైర్మన్ మిద్దె రవి, హోటల్ మల్లి,ఫీల్డ్ అసిస్టెంట్ పులికొండ లు ప్రారంభించారు.మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా వివిధ గ్రామ పంచాయతీల నందు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలను అధికారులు,ప్రజాప్రతినిధులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అధికారులు,ప్రజా ప్రతినిధులు,ఉపాధి సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.