
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన అధికారులు
హొళగుంద న్యూస్ వెలుగు : మండల కేంద్రంలో సోమవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నా ఖ్వాస్ టీం సభ్యులు డాక్టర్ సుకుమార్,డాక్టర్ రామేశ్వర్ పాండే పరిశీలించారు.ఇందులో భాగంగా రికార్డులను,ఆస్పత్రి రూములను,పరికరాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యాధికారులు రోగుల పట్ల దయతో వైద్య చికిత్స చేయాలని ఆస్పత్రిలో నెలకు 35 మహిళా కాన్పులు జరుగుతున్నాయని,ఓపి వైద్య చికిత్స గణనీయంగా పెరిగిందన్నారు.మరియు లేబర్ రూములు పెద్దదిగా మార్చడానికి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని చెప్పారు.వైద్యాధికారుల సేవ పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు.టీమ్ వెంట వైద్యాధికారులు డాక్టర్ న్యూటన్,డాక్టర్ బిందు మాధవి,డాక్టరు రూప్కుమార్, సిహెచ్ఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!