ప్రత్యేక వైద్య సౌకర్యల ఏర్పాటుకు ఆదేశం: డా.సి.ప్రభాకర రెడ్డి
కర్నూలు న్యూస్ వెలుగు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సి.ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 15న జరగబోయే గణేష్ నిమజ్జనం సందర్భంగా వైద్య సిబ్బందికి అప్రమత్తం చేసినట్లు సూపరింటెండెంట్, డా.సి.ప్రభాకర రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా రాపిడ్ రెస్పాన్ టీం ఏర్పాటు ప్రత్యేక వైద్య సౌకర్యాలు అందించనున్నట్లు వెల్లడించారు. రాపిడ్ రెస్పాన్ టీం సభ్యులు డా.రామ్‌శివ నాయక్, ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రొఫెసర్ HOD,డా.బి. వెంకటేశ్వరరావు, సిఎస్‌ఆర్‌ఎంఓ, .డా.B.హేమ నళిని, Dy.CSRMO, డా.వెంకట రమణ, ARMO గణేష్ నిమజ్జనం రోజైన 15.09.2024 నుండి అందుబాటులో ఉండాలి సూచించారు. కేసులను పూర్తయ్యేవరకు అందుబాటులో ఉండాలని రాపిడ్ రెస్పాన్ టీం కు ఆదేశాలు జారీ చేశారు. CMO’S, DAP, DAS, ఇతర సహాయక సిబ్బంది కేసులను త్వరగా పరిష్కరించడం కోసం అందుబాటులో ఉండాలని వైద్యులకు ఆదేశించినట్లు తెలిపారు. క్యాజువాలిటీ విభాగంలోని అత్యవసర కేసులు వచ్చినప్పుడు యుద్ధ ప్రాతిపది చర్యలు చేపట్టాలని వైద్యులకు ఆదేశించారు. సెప్టెంబర్ 15న CMOలు, DAP, DAS ఇతర సహాయక సిబ్బంది క్యాజువాలిటీలో పని చేసేవారికి సెలవులన్నీ రద్దు చేస్తున్నట్లు తెలిపారు.