
బీసీ కార్పొరేషన్ కు 400 పైగా దరఖాస్తులు
ఎంపీడీఓ విజయ లలిత
హోళగుంద,న్యూస్ వెలుగు: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బీసిల సంక్షేమం కోసం కార్పోరేషన్ ద్వారా బీసీలు లబ్ధి పొందేందుకు మండలానికి 72 యూనిట్ ఇవ్వడంతో దాదాపు 400 పైగా మంది దరఖాస్తులు చేసుకున్నట్లు శనివారం ఎంపీడీఓ విజయ లలిత పాత్రికేయులకు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులు ఆర్థికంగా పురోభివృద్ధి చెందవచ్చన్నారు.మన మండలానికి 72 యూనిట్ కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు.దాదాపు 50% శాతం సబ్సిడీ ఉంటుందని తెలియజేశారు. ఈరోజుకి దరఖాస్తులు గడువు ముగిసినది మరిన్ని వివరాలకు కోసం మండల కార్యాలయానికి సంబంధించిన లబ్ధిదారులకు సూచించారు.
Was this helpful?
Thanks for your feedback!