పీ. దీక్షిత్ .. ది ఇన్నోవేటర్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డు సాధించడం గర్వకారణం

పీ. దీక్షిత్ .. ది ఇన్నోవేటర్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డు సాధించడం గర్వకారణం

శ్రీలక్ష్మీ విద్యాసంస్థల చైర్మన్ పీ.దీక్షిత్ కి శుభాకాంక్షలు తెలిపిన రాయలసీమ సంఘాల నాయకులు.
కర్నూలు, న్యూస్ వెలుగు : హౌస్ ఆఫ్ లార్డ్స్ బ్రిటిష్ పార్లమెంట్ యునైటెడ్ కింగ్డమ్ నందు వరల్డ్ స్కూల్స్ సమ్మిట్-2025 నుండి ది ఇన్నోవేటర్ ఇన్ ఎడ్యుకేషన్ క్యాటగిరిలో ఇండియా నుండి ఎంపికై బ్రిటిష్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్ సభ్యులు లార్డ్ డానియల్ బ్రెనన్ నుండి అవార్డును అందుకుని భారతదేశానికి చేరుకున్న శ్రీలక్ష్మీ విద్యాసంస్థల చైర్మన్ పీ.దీక్షిత్ ని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్, రాయలసీమ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మదాసికురువ సంకన్న, జిల్లా అద్యక్షులు అశోక్ లు స్థానిక శ్రీలక్ష్మీ విద్యాలయంలో ఘణంగ సత్కరించారు ఈ సందర్భంగా రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్ మాట్లాడుతూ కర్నూలు నుండి ఈ అవార్డును అందుకోవడం గొప్పవిషయమని భవిష్యత్తులో శ్రీలక్ష్మీ విద్యాసంస్థల చైర్మన్ పీ.దీక్షిత్ విద్యార్ధులను అన్నిరంగాలలో ఉత్తమ ఫలితాలను సాధించేల తీర్చిదిద్ది విద్యాసంస్థను మరింత గొప్పగా తీర్చిదిద్దగలరని ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి గొప్ప అవార్డులను సైతం సొంతం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి విద్యాసంస్థల అధినేత పీ. శేషన్న గారు,నాయకులు మదాసికురువ భరత్ కుమార్,రాము, మహేష్,రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!