పిల్లలకు ఆదర్శవంతులు..తల్లిదండ్రులు,ఉపాధ్యాయులే
విద్యార్థుల బంగారు భవిష్యత్ తల్లిదండ్రులు,గురువుల చేతిలోనే ఉంది.
ఉపాధి హామీ పథకం ఏపీడి పక్కీరప్ప.
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని తుగ్గలి మండలంలోని రోళ్ళపాడు తండా గ్రామంలోని స్థానికంగా ఉన్న ఎంపీపీ పాఠశాలలో హెడ్మాస్టర్ అనురాధ , ఉపాధ్యాయురాలు వరలక్ష్మి అధ్యక్షతన విద్యార్థుల తల్లిదండ్రులు సమక్షంలో మెగా పిటీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపాధి హామీ ఏపిడి పక్కిరప్ప,క్లస్టర్ టెక్నికల్ అసిస్టెంట్ వెంకప్ప,టెక్నికల్ అసిస్టెంట్ జయరాం,కర్నూలు జిల్లా సీపీఐ సమితి సభ్యులు రోళ్ళపాడు గ్రామ పసెద్దుల వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో భాగంగా ఎ.పి.డి పక్కిరప్ప,సిపిఐ జిల్లా సమితి సభ్యులు రోళ్లపాడు పి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్ వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులతో పాటు విద్యార్థులకు పాఠాలు నేర్పుతున్న గురువుల భాధ్యత అని తెలియజేస్తూ,పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులు,వారికి విద్య నేర్పుతున్న ఉపాద్యాయ ఉపాధ్యాయనీలు విద్యార్థుల జీవిత గమనంలో వారి అభివృద్ధికి తోడ్పడాలని పిల్లల యొక్క అభిరుచికి అనుగుణంగా ఉంటూ, నిత్యం విద్యార్థులను వారి అలవాట్లను గమనిస్తూనే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సామాజిక అంశాల గురించి పిల్లలకు వివరిస్తూనే విద్యార్థులకు సెల్ ఫోన్లు,గత ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ఇచ్చిన ట్యాబ్ లకు దూరంగా ఉంచుతూ సెల్ ఫోన్లు, ట్యాబ్ లను ఉపయోగించకుండా,వాటి నుంచి వచ్చే అనేక సమస్యల గురించి పిల్లలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ విద్యార్థులు ఇష్టంగా చదివితే చదువు యొక్క ప్రతిఫలాలను తెలుపుతూ గొప్ప గొప్ప మేధావుల యొక్క పోటోలను వారి జీవిత చరిత్రలు కళ్ళకు కట్టినట్లు కథల రూపంలో పిల్లలకు తెలియజేసి విద్యార్థుల ఎదుగుదలకు తోడ్పడుతూ నిత్యం విద్యార్థులకు తల్లిదండ్రులు ఉపాద్యాయులు ఆధర్శవంతులుగా ఉండాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు రోళ్ళపాడు పసెద్దుల వెంకటేశ్వర్లు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తులసి నాయక్,శ్రీను నాయక్,వెంకట నాయక్,లాలు నాయక్,పాఠశాల ఉపాధ్యాయులు వరలక్ష్మి,పాఠశాల విద్యాకమిటి వైస్ చైర్మన్ మంగమ్మ బాయి,విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.