తుగ్గలి న్యూస్ వెలుగు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 21 శనివారం రోజున ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నాలని తుగ్గలి ఎంపీడీవో విశ్వమోహన్ తెలియజేశారు.ఈ సందర్భంగా గురువారం రోజున విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తుగ్గలి మండలంలో ఎంపిక చేసిన కేంద్రాలలో ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని గల అన్ని గ్రామాల యందు గ్రామ సర్పంచ్,వార్డు మెంబర్ల అధ్యక్షతన యోగా ట్రైనర్ల ఆధ్వర్యంలో 6:45 యోగా కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎంపీడీవో తెలియజేశారు.కావున అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,ప్రభుత్వ ఉద్యోగులు,పుర ప్రముఖులు,పౌరులు,విద్యార్థులు తదితరులు పాల్గొని యోగాంద్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో విశ్వమోహన్ తెలియజేశారు.
Thanks for your feedback!