ప్రశాంతంగా నీటి పారుదల సంఘం ఎన్నికలు

ప్రశాంతంగా నీటి పారుదల సంఘం ఎన్నికలు

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శనివారం నీటి పారుదల సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.ఇందులో హోళగుంద నెంబర్ -3 సేక్షన్ నందు ప్రసిడెంట్ గా బడేఘర్ ఉస్మాన్ సాబ్,వైస్ ప్రసిడెంట్ గా సిద్దిక్ సాబ్ లతో పాటు 11 మంది సభ్యులను,నెంబర్ – 4 సేక్షన్ నందు ప్రసిడెంట్ గా మిక్కిలినేని ప్రసాద్,వైస్ ప్రసిడెంట్ గా రామచంద్ర తో పాటు 12 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అలాగే గెజ్జెహళ్లి, సాగునీటి సంఘం ప్రెసిడెంట్ గా ఎర్రి స్వామి వైస్ ప్రెసిడెంట్ గా వంద వా గీలి పంపా రెడ్డి ఎన్నుకున్నారుహెబ్బటం గ్రామాల్లో కూడా నీటి పారుదల సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సిఐ సుబ్బారావు, ఎస్ఐ బాల నరసింహులు సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ రాజా పంపన గౌడ మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య గోవింద గౌడ్ రైస్ మిల్ మురళి కాడ సిద్ధప్ప పంపాపతి వేరి ఎర్రి స్వామి అబ్దుల్ సుభాను స్వామి డి ఎస్ భాష గిడ్డి వెంకటేష్ దిడ్డి నాగప్ప కూటమి నాయకులు ఎన్నికల అధికారు లు ఎల్ ఎల్ జె ఈ ఈశ్వర్, పి ఆర్ ఏ ఈ యనుమప్ప,కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!