
బస్సు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
నంద్యాల, న్యూస్ వెలుగు : బండి ఆత్మకూరు మండల కేంద్రంలో బస్సు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బండి ఆత్మకూరు గ్రామానికి చెందిన బోయ బాలన్న మంగళవారం బండి ఆత్మకూరు నుండి నంద్యాలకు వెళ్లడానికి బస్టాండ్ లో ఆత్మకూరు డిపో ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా డ్రైవర్ ఎక్కక ముందే కదిలించడంతో కిందపడి కాలిపై టైర్ ఎక్కిందని తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం సంభవించిందని తెలిపారు. వెంటనే స్థానికులు 108 వాహనంలో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Was this helpful?
Thanks for your feedback!

