
మండల కేంద్రంలో పోషణ్ పక్వాడ పక్షోత్సవాల కార్యక్రమం
* అంగన్వాడి కేంద్రం నందు స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహణ.
తుగ్గలి న్యూస్ వెలుగు : మండల కేంద్రమైన తుగ్గలి నందు అంగన్వాడి కేంద్రం నందు గర్భవతుల మరియు బాలింతల ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడ పక్షోత్సవాల కార్యక్రమాన్ని శనివారం రోజున అంగన్వాడీ టీచర్ల సమక్షంలో సూపర్వైజర్లు అంబికా,త్రివేణి లు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా సూపర్వైజర్లు మాట్లాడుతూ ఏప్రిల్ 8 నుండి 22వ తేదీ వరకు పోషణ్ పక్వాడ పక్షోత్సవాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం 1000 రోజుల ప్రాముఖ్యత గురించి గర్భవతులకు,బాలింతలకు మరియు సినిమా నుండి రెండు సంవత్సరాల పిల్లల తల్లులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమము యొక్క ముఖ్య ఉద్దేశమని వారు తెలియజేశారు.అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతినెల మూడవ శనివారం రోజున నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహించి,విద్యార్థులకు ప్రతిజ్ఞను చేయించారు.అంగన్వాడి కేంద్రాలలో మరియు మన చుట్టు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గర్భవతులకు, బాలింతలకు వారు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్లు అంబికా, త్రివేణి,మహిళా పోలీస్ శాంత కుమారి, అంగన్వాడి టీచర్లు కాంతమ్మ,జ్యోతి, రమీజాబి,జయలక్ష్మి మరియు అంగన్వాడి హెల్పర్స్,గర్భవతులు, బాలింతలు మరియు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.