మారెళ్ళ సొసైటీ చైర్మన్ గా  ప్రభాకర్ రెడ్డి

మారెళ్ళ సొసైటీ చైర్మన్ గా ప్రభాకర్ రెడ్డి

తుగ్గలి న్యూస్ వెలుగు:  కర్నూలు జిల్లాకు సంబంధించి సహకార సంఘం అధ్యక్షులను రాష్ట్ర ప్రభుత్వం శనివారం రోజున విడుదల చేసింది.తుగ్గలి మండల పరిధిలోని గల మారెళ్ళ సొసైటీ అధ్యక్షులుగా ఎద్దులదొడ్డి గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మారెళ్ళ సొసైటీ మెంబర్లు గా బొందిమడుగుల మోహన్,రాంపల్లి శ్రీనివాసులు లు ఎంపికయ్యారు. అదేవిధంగా ఉప్పర్లపల్లె సొసైటీ చైర్మన్గా ఉప్పర్లపల్లి గ్రామానికి చెందిన అప్ప వేణుగోపాల్ రాయల్, సొసైటీ మెంబర్లుగా దిగువ చింతల కొండకు చెందిన చిన్న పెద్దయ్య,రాంపురం గ్రామానికి చెందిన భీమ లింగప్పలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్లు మరియు మెంబర్లు మాట్లాడుతూ సహకార సంఘం సభ్యులుగా తమను ఎంపిక చేసినందుకు పత్తికొండ శాసనసభ్యులు కేఈ శాంబాబుకు,రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.సహకార సంఘం సభ్యులుగా తమ విధులను సక్రమంగా నిర్వర్తించి,రైతులు మరియు ప్రభుత్వ అభివృద్ధి కొరకు కృషి చేస్తామని వారు తెలియజేశారు. సహకార సంఘం సభ్యులుగా ఎంపికైన సభ్యులకు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!