
సుభద్ర పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 74వ పుట్టిన రోజున సుభద్ర పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఒడిష లో ప్రధానికి బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గిరిజన జానపద నృత్యాలు, డప్పు వాయిద్యాలతో అద్భుతమైన సంప్రదాయ స్వాగతం లభించింది, అక్కడ వేలాది మంది అభిమానులు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సుభద్ర యోజన మహిళా సాధికారతను పెంపొందిస్తుందని, మన ‘నారీ శక్తి’కి ఆర్థిక స్వాతంత్య్రాన్ని కల్పిస్తుందని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో శ్రీ మోదీ అన్నారు. 21 మరియు 60 సంవత్సరాల మధ్య వయస్సు గల అర్హులైన మహిళలందరికీ ఐదేళ్ల వ్యవధిలో 50,000 రూపాయలు అందుతాయన్నారు.
ఈ కార్యక్రమం కోటి మందికి పైగా మహిళలను కవర్ చేస్తుందని భావిస్తున్నారు. ప్రధాని మోదీ తన పర్యటన సందర్భంగా 25 లక్షల 11 మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి 1250 కోట్ల రూపాయల నిధుల విడుదల చేసారు. అంతకుముందు, భువనేశ్వర్‌లోని గడకానా వద్ద స్లమ్ ఏరియాను సందర్శించిన మోదీ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్‌లో 20 మంది లబ్ధిదారులతో సంభాషించారు. యోజన కింద నిర్మించిన ఇళ్ల తాళాలను ఆయన లబ్ధిదారులకు అందజేశారు.