నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించండి

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించండి

కర్నూలు న్యూస్ వెలుగు.  రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య నానాటికి పెరుగుతుందని ఉపాధి కల్పించాలని రాయలసీమ రాష్ట్ర ఉద్యమ నాయకులు కొత్తూరు సత్యనారాయణ గుప్తా కోరారు. గురువారం అయిన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగం కల్పించని పక్షంలో పెడదోవ పడే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఏ ఉపాధి లేని సంఖ్య నానాటికి పెరుగుతున్నదని, సుమారు కోటిన్నర పైగా యువతి యువకులు ఉన్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో యువతీ యువకులకు ఈ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని, ప్రభుత్వం ఒక ప్రణాళిక బద్ధంగా ఉద్యోగ ఉపాధి కల్పించాలని ఆయన కోరారు. అనేకమంది నిరుద్యోగులు వివిధ రంగాలలో నైపుణ్యం కలిగి ఉన్నారని లేని వారికి శిక్షణ ఇచ్చి తాను ఉపాధి పొందుతూ పదిమందికి ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో సుమారు 3.20 లక్షల ఖాళీలు ఉన్నట్లు ప్రచారంలో ఉందన్నారు. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని అమరావతిని ఫ్రీ జోన్ గా ప్రకటించి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కూడా ఆయన కోరారు. ప్రభుత్వం నిరుద్యోగ భృతి కల్పించేందుకు కృషి చేయాలని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి అని కూడా ఆయన కోరారు. ప్రతి జిల్లా కేంద్రంలో నిరుద్యోగ యువతీ యువకులతో సదస్సులను ఏర్పాటు చేసి వారిని భరోసా కల్పించేందుకు కృషి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. చదువు రాని వాడు ఏ పనినైనా చేసుకొని జీవించే అవకాశం ఉంటుందని కానీ చదువుకున్నవాడు ఉద్యోగం లేదా ఉపాధి లేకపోతే జీవితం అంధకారం అవుతుందని అని తెలిపారు .తల్లిదండ్రులకు భారంగా మారే అవకాశం కూడా ఉంటుందని ప్రతి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి కూడా కృషి చేయాలని, ఆయా జిల్లాలో ఉత్పత్తి అవుతున్న ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు శిక్షణ తరగతులు కూడా నిర్వహించాలని కూడా ఆయన కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS