మంచి అవకాశాల కోసం వెంటపడాలి

మంచి అవకాశాల కోసం వెంటపడాలి

   మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ 

కర్నూలు, న్యూస్ వెలుగు; మారుతున్న కాలానికి అనుగుణంగా మంచి అవకాశాల కోసం క్రీడాకారులు సాధన చేసి ఉజ్వల భవిష్యత్తును పెంపొందించుకోవాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు.
శనివారం స్థానిక కర్నూలు క్లబ్ టెన్నిస్ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన 8వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ టెన్నిస్ పోటీల ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
మీ సాధనకు అనుగుణంగా విద్య ఉద్యోగ అవకాశాలు ఉండే క్రీడలను ఎంచుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. తద్వారా ఆరోగ్యం మనసిక వికాసం లభిస్తుందన్నారు. విద్యార్థులు నిరంతర శారీరక శ్రమ ద్వారా రాణిస్తే ఆరోగ్యం పెంపొందింది అన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వాసవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ ధన్య, రాష్ట్ర సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్, జిల్లా ఒలింపిక అసోసియేషన్ అధ్యక్షులు బి. రామాంజనేయులు, జిల్లా సంఘం కార్యదర్శి నవీన్ శావల్, పీఠల సంఘం ప్రతినిధి కొండేపి చిన్న సుంకన్న, సుప్రియ గీత సంఘం ప్రతినిధులు రేవంత్, సురేష్, వ్యాయామ ఉపాధ్యాయులు గీత, సుప్రియ ,రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!