తెలుగుదేశం నాయకులపై ఎస్పీకి ఫిర్యాదు
Puttaparthi (పుట్టపర్తి) క్రైం జూలై 29: శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలపై వేధింపులను వెంటనే ఆపాలని శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ కి అంగన్వాడి సెక్టార్ లీడర్లు సీఐటీయూ నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన నాటి నుండి, స్క్రీమ్ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలపై వేధింపులు తరచూ జరుగుతున్నాయని, ఇటీవల ఒడిసి మండలంలోని వీరప్ప గారి పల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకుడు, నాగమణి మినీ అంగన్వాడి వర్కర్ పై లేనిపోని ఆరోపణలు మోపడంతో ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడి ప్రాణాపాయ స్థితిలో ఉందని దీనికి కారణమైన ఆంజనేయులుని, వెంటనే అరెస్టు చేయాలని కోరారు. అంతేకాక సోమందేపల్లి ,ఓడిసి కదిరి ,మండలాల్లో అంగన్వాడి కార్యకర్తలను తెలుగుదేశం, జనససేన, నాయకులు వేధింపులకు గురి చేస్తున్నారని, ఇలా ప్రభుత్వం మారినప్పుడల్లా అంగన్వాడీ కార్యకర్తలకు వేధించడం భయభ్రాంతులకు గురి చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే సిఐటియు నాయకులు ఉద్యమాలు చేయక తప్పదని ఎస్పీకి తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధ్యక్షురాలు మాబునిషా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి, కోశాధికారి సిఎస్ శ్రీదేవి, లావణ్య ,రంగమ్మ, ఆశీర్వాదమ్మ ,శ్రామిక మహిళా నాయకురాలు, సిఐటియు నాయకులు ఈ ఎస్ వెంకటేష్, లక్ష్మీనారాయణ రమేష్, బ్యాళ్ల అంజి ,వెంకటేష్, ఎస్పీకి ఫిర్యాదును అందించారు.