రజకులకు దేవాలయాల కమీటీల్లో స్థానం కల్పించాలి

రజకులకు దేవాలయాల కమీటీల్లో స్థానం కల్పించాలి

న్యూస్ వెలుగు,  కర్నూలు; కర్నూలు జిల్లా రజక సాధికార కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం మందు ధర్నా చేశారు. దేవాలయాల్లో రజకులు దివిటీలు పట్టడం, చీరలు పరచడం, పల్లకీలు మోయడం వంటి కార్యాక్రమాలు చేస్తుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి పెద్దలు సహకరించి తమకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో బ్రాహ్మణులతో పాటు తమను కమీటీ సభ్యుల్లో చేర్చుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో రాయలసీమ రజక సాధికార కమిటీ కన్వీనర్ సీహెచ్. లింగమయ్య, జిల్లా అధ్యక్షుడు గణేష్, వెంకటేష్, మహిళా అధ్యక్షురాలు రేణుక, సిటీ అధ్యక్షురాలు రాధమ్మ, ఉపేంద్ర, న్యాయవాది జగదీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. సీహెచ్. లింగమయ్య, రాయలసీమ రజక సాధికార కమిటీ కన్వీనర్.
మలంగిరి గణేష్. జిల్లా అధ్యక్షుడు.

Author

Was this helpful?

Thanks for your feedback!