
రిజర్వాయర్ బాధిత రైతులకు పరిహారం చెల్లించండి
మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ పొన్నపు రెడ్డి రామ సుబ్బారెడ్డి
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; బుధవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలంలో గండికోట ప్రాజెక్టు లో ముంపుకు గురైన 22 గ్రామాలకు గాను మొదటి విడత ముంపుకు గురైన 14 గ్రామాల ప్రజలకు ఒక్కొక్క లబ్ధిదారునికి 6 లక్షల 75 వేల రూపాయల ప్రకారము చెల్లించడం జరిగినది. రెండో విడత 8 ముంపు గ్రామాలకు గాను ఒక్కొక్క లబ్ధిదారునికి 10 లక్షల రూపాయలు చెల్లించడం జరిగినది. అయితే మొదటి విడతలో 14గ్రామాలకు గాను 9,700 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి చెల్లించాల్సిన 3,లక్షల 25 వేల ప్రకారము సుమారు 500 కోట్లు పెండింగ్ లో ఉంది.. కావున ఈ మొత్తాన్ని కూడా ఈ బడ్జెట్ లోనే కేటాయించాలని మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి శాసనమండలిలో కోరడమైనది. పెద్దముడియం మండలం రాజోలి రిజర్వాయర్ క్రింద ముంపుకు గురైన గ్రామాల రైతులకు సంబంధించిన దాదాపుగా 4 వేల ఎకరాల వ్యవసాయ భూమికి ఎకరానికి 12 లక్షల 50వేల రూపాయలు పరిహారం చెల్లించుటకు రెండు సంవత్సరాల కిందట అవార్డు పాస్ చేయడం జరిగినది.కానీ
రైతులు ఎన్నికలకు ముందు నారా చంద్రబాబునాయుడు ,లోకేష్ కడప జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు రాజోలు ముంపు గ్రామానికి సంబంధించిన రైతులు వారిని కలిసి మాకు 12.50/- లక్షల రూపాయలు సరిపడదు పరిహారం పెంచాలని కోరగా .. దానికి వారు సానుకూలంగా స్పందించి ప్రభుత్వం రాగానే పరిహారం పెంచుతామని హామీ ఇచ్చారని రైతులు తెలియజేస్తున్నారు.ఈ మొత్తాన్ని కూడా ఈ బడ్జెట్ లోనే కేటాయించి రాజోలు రిజర్వాయర్ రైతులకు వెంటనే పరిహారం చెల్లించి ఆదుకోవాలని ఈ సభ ద్వారా ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి గారు కోరడం జరిగినది.