
రామాంజనేయులు మృతి బాధకారం
ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టి.ఎం రమేష్ మాదిగ
ఆలూరు, న్యూస్ వెలుగు; శుక్రవారం చిప్పగిరి మండలం ఖాజీపురం గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ఎస్ కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి రామాంజినేయులు మృతి చాలా బాధాకరం అని ఆంధ్రప్రదేశ్ ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టి ఎం రమేష్ మాదిగ గారు* సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మార్పీఎస్ఎస్ కమిటీ పటిష్టతకు ఆయన చేసిన సేవలు మరువలేనిదన్నారు.వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు .వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యం కల్పించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ఎమ్మార్పీఎస్ఎస్ అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎమ్మార్పీఎస్ఎస్ ఆలూరు నియోజకవర్గం కన్వీనర్ కురవల్లి ఉదయ్ మాదిగ పత్తికొండ మండలం అధ్యక్షుడు రంగన్న మాదిగ తుగ్గలి మండలం కార్యదర్శి రామాంజనేయులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.