తుగ్గలి న్యూష్ వెలుగు: తుగ్గలి మండల తహసిల్దార్ గా రవి బుధవారం రోజున బాధ్యతలు స్వీకరించారు.

జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తుగ్గలి తహసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న రమాదేవిను మంత్రాలయంకు బదిలీ చేయగా, మంత్రాలయంలో తహసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న రవిను తుగ్గలి తాసిల్దారుగా బదిలీ చేస్తూ జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా బుధవారం రోజున తుగ్గలి మండల తహసిల్దార్ గా రవి బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా తుగ్గలి తహాసిల్దార్ కార్యాలయ ఉద్యోగులు,సిబ్బంది తహసిల్దార్ రవి ను శాలువాతో ఘనంగా సన్మానించి బొకే ను అందజేసి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా తహసిల్దార్ రవి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా అధికారులు విధులు నిర్వహించాలని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహాసిల్దార్ సుదర్శన్, మండల సర్వేయర్ సుధాకర్,ఆర్ఐ వెంకట రాముడు,వీఆర్వోలు, సర్వేయర్లు,రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Thanks for your feedback!