
అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి రెడ్ క్రాస్ చేయూత
బండి ఆత్మకూర్, న్యూస్ వెలుగు: గత రెండు రోజుల కిందట మండలంలోని కడమల కాల్వ గ్రామంలో అర్ధరాత్రి ప్రమాదవశాత్తు ఈశ్వరమ్మ మహిళ పూరి గుడిసె అగ్ని ప్రమాదానికి గురై దగ్ధమైంది. గ్రామస్తులు ద్వారా విషయం తెలుసుకున్న రెడ్ క్రాస్ సంస్థ మంగళవారం గ్రామానికి వెళ్లి మహిళ ఈశ్వరమ్మను పరామర్శించి తార్పోలిన్ పట్టా వంట సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా మండల రెడ్ క్రాస్ కన్వీనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు.మండలంలో ఎలాంటి ప్రమాదాలు జరిగిన ఎల్లప్పుడూ రెడ్ క్రాస్ అండగా ఉంటుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో వీఆర్వో చిన్న వెంకటేశ్వర్లు షరీఫ్ మోహన్ భరత్ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!