ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయండి:  మాజీ ఎమ్మెల్సీ

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయండి: మాజీ ఎమ్మెల్సీ

న్యూస్ వెలుగు కర్నూలు: ఆదోని బిజెపి ఎమ్మెల్యే పై, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుడిసె కృష్ణమ్మపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు గారు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుధాకర్ బాబు గారు మాట్లాడుతూ ఆదోని మండలం ధనాపురం గ్రామంలో జరిగిన కూటమి ప్రభుత్వం సంవత్సర పాలన సంబరాలు జరుపుకుంటూ గుడి దగ్గర జరిగిన సభలో దళితుడైన సర్పంచ్ చంద్రశేఖర్ ను అవమానించడం బాధాకరమన్నారు. సర్పంచ్ చంద్రశేఖర్ వేదిక దగ్గరికి వచ్చిన వేదికపైకి పిలవకుండా క్రింద నిలబెట్టి మాట్లాడటం దళిత జాతికి అవమానకరమని ప్రజా ప్రతినిధులు కూటమి నాయకులు, రాజ్యాంగ హక్కులను గౌరవించి సాటి మనిషిని మనిషిగా చూడటం నేర్చుకోవాలని హితవు పలికారు.

ఒకపక్క మమ్ములను ఎస్టీ జాబితాలో చేర్చాలని అడుగుతూ ఎస్సీలను అవమాన పరచడం ఎంతవరకు సమంజసం అని సుధాకర్ బాబు గారు ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు మంచి పరిపాలన అందిస్తున్నారని మంచి పేరు ఉందని ఆదోని ఎమ్మెల్యే పైన, గుడిసె కృష్ణమ్మ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఈ కేసును సుమోటోగా తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని సుధాకర్ బాబు గారు తెలియజేశారు. అనంతరం మాజీ డిసిసి అధ్యక్షులు కే బాబురావు గారు మాట్లాడుతూ చంద్రశేఖర్ గారిని స్టేజి మీదకు పిలవకుండా అవమానపరిచినందుకు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి పై, గుడిసే కృష్ణమ్మ పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని తెలియజేశారు. అనంతరం జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ ఎన్సి బజారన్న గారు మాట్లాడుతూ దళిత సర్పంచ్ చంద్రశేఖర్ ను అవమానించడం దళిత జాతికి అవమానమని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చిత్తూరు జిల్లాలో దళిత మహిళను చెట్టుకు కట్టి కొట్టడం జరిగిందని దళితులపై దాడులు ఎక్కువయ్యాయని, ఆదోని ఎమ్మెల్యే పై గుడిసె కృష్ణమ్మ పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని త్వరలో జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ఎస్పీ గారిని కలిసి వినతి పత్రం సమర్పిస్తామని తెలియజేశారు. అనంతరం కోడుమూరు కోఆర్డినేటర్ అనంతరత్నం మాదిగ మాట్లాడుతూ దళిత సర్పంచ్ చంద్రశేఖర్ స్టేజి మీదకి పిలవకుండా కిందనే నిలుచోబెట్టి ఎస్సీ అని సంబోధించి అవమానపరచడం దళిత జాతికి అవమానమని వెంటనే వారి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షులు కే బాబురావు, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ ఎన్సి బజారన్న, కోడుమూరు కోఆర్డినేటర్ అనంత రత్నం మాదిగ, ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు బి బతుకన్న, మైనార్టీ సెల్ జిల్లా చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్, కేకేసి చైర్మన్ ఎజాస్ అహ్మద్, జిల్లా మహిళా కాంగ్రెస్ ఎస్ ప్రమీల కాంగ్రెస్ నాయకులు సయ్యద్ నవీద్, ఎండ్లురు లాజరస్, అబ్దుల్ హై, ఐఎన్టియుసి రేపల్లె ప్రతాప్, జాన్ సదానందం కిషోర్ మొదలగు వారు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!