
పూర్వ విద్యార్థుల సమ్మేళనం రేపే..!
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: మండలం పరిధిలోని ఆర్ ఎస్ పెండెకల్ లో స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1994సంవత్సరంలో 6 వ తరగతి నుంచి 1999 వ సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్ధిని విద్యార్థుల సమక్షంలో ఆదివారం 29వ తేదిన వీరికి విద్యను బోధించిన అలనాటి గురువులు సమక్షంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ అనురాగ సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమానికి అలనాడు చదువుకున్న పూర్వపు విద్యార్ధిని విద్యార్థుల సకుటుంబ సమేతంగా పాల్గొని ఆత్మీయ అనురాగ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని 1994 నుంచి 1999 వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు…
Was this helpful?
Thanks for your feedback!