మండలంలో టీడీపీ సర్పంచ్ ల రాజీనామాలు

మండలంలో టీడీపీ సర్పంచ్ ల రాజీనామాలు

*కుంభలూరు,గోతులదొడ్డి ,ఉరుకుంద, సర్పంచులు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా

 కౌతాళం, న్యూస్ వెలుగు : కౌతాళం మండల ఉరుకుంద గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహ ఈరన్నస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి కనీసం తెలుగుదేశం పార్టీ సభ్యత్వాo కూడా లేని వ్యక్తికి చైర్మన్ పదవి ఇవ్వడం చాలా ఆశ్చర్యంగా ఉందని ఉరుకుంద సర్పంచ్ టి.రాధా అన్నారు . తెలుగుదేశం పార్టీలో కష్టపడిన కార్యకర్తలను గుర్తించకుండా పార్టీ సభ్యత్వం కూడా లేని వ్యక్తికి పదవులు ఇవ్వడం. ఏంటని, 30 సంవత్సరాలుగా టిడిపి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి ఉన్న ఆస్తులు అమ్ముకొని పార్టీ బలోపేతానికి కృషిచేసిన వారికి కాకుండా ఎక్కడో పార్టీ సభ్యత్వం కూడా లేని పాండురంగయ్య చెట్టుకి ఎలా కట్టబెట్టారని సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కి నారా లోకేష్ కి ,పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస రావు కి ముఖ్యంగా మంత్రాలయం నియోజక వర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, తెలుగుదేశం పార్టీ కోసం గత 30 సంవత్సరాలుగా పార్టీ కోసం ఎంతో మంది నాయకులు కార్యకర్తలు తమ ధన,ప్రాణాలను పణంగా పెట్టి అహర్నిశలు పనిచేసిన వారిని కాదని ముఖ్యంగ యువనేత నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా శైవ దేవాలయాలలో చైర్మన్ పదవులను వీరశైవ లింగాయతులకు కేటాయిస్తానని మాట ఇచ్చి నారునీ. కానీ ఈ రోజు కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేని వ్యక్తి స్థానికేతరుడు పాండురంగయ్యశెట్టి కి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం,ఉరుకుంద గ్రామంలోని శ్రీ నరసింహం ఈరన్న స్వామి దేవస్థానం చైర్మన్ పదవిని కేటాయించడం జరిగిందనీ వాపోయారు.కానీ మంత్రాలయం నియోజకవర్గంలో పార్టీని రక్షించే బాధ్యత నారా లోకేశ కు ఉంది. శైవ క్షేత్రం అయిన శ్రీ నరసింహం ఈరన్న స్వామి దేవస్థానం.పాలకమండలి చైర్మన్ పదవిని వీరశైవులకు కేటాయించ నందుకు నిరసనగా మా యొక్క తెలుగుదేశం పార్టీ కుంభలనూరు సర్పంచ్ వీరేష్ మరియు ఉరుకుంద సర్పంచ్ టీ .రాధ పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.అలాగే టిడిపి నాయకులు వల్లూరు నాగేశ్వరరావు అల్లూరు పట్టాభి పలువురు సీనియర్ నాయకులు కూడా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు..

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS