
అకాల వర్షాలకు దెబ్బతిన్నా వరిపంట
న్యూస్ వెలుగు హొళగుంద : ఓ వైపు మండే ఎండలు.. మరోవైపు ఈదురుగాలులు, వడగండ్ల వానలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముఖ్యంగా అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి.వడ్లు రాలిపోయి గడ్డి మాత్రమే మిగలడంతో రైతులు లబోదిబోమమంటూ రోదించారు. రైతులను ఆదుకోవాలని కోరారు. పంట నష్టంతో తిందామంటే లేకుండా పోయిందని రైతులు రాలిన వరిగడ్డితో రోదిస్తూ నేలను బాదుకున్నారు. భారీ ఈదురు గాలులకు మిరప కల్లాలు నీటిపాలయ్యింది. చెట్లు నేలకొరిగి రహదారులు మూసుకుపోయాయి. కల్లాల్లోని మిరప.. కన్నీరు పెట్టించింది. కురిసిన అకాల వర్షానికి కల్లాల్లో ఆరబెట్టిన మిరప కాయలు తడిసిపోయాయి. కొందరు టార్పాలిన్లు కప్పగా, లేనివారి కుప్పలు తడిసిపోయాయి. చేతికొచ్చిన మిరప కాయలు వర్షానికి తడిస్తే రంగు మారి ధర తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట దిగుబడులను గ్రేడింగ్ చేయడానికి
కల్లాల్లో ఆరబెట్టారు. ప్రధాన రహదారిపై వృక్షాలు నేలకొరిగి రాకపోకలు నిలిచిపోయాయి. బాధిత రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.