సమాచార హక్కు కార్యకర్తల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో సోమవారం పోలీస్ స్టేషన్, తహశీల్దార్,ఎంపీడీఓ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం కార్యకర్తల సంఘం ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వడ్డే విశ్వనాథ్ రాజ్ ,వెంకట గిరి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005 పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మరియు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూడ వలసిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుడి పై ఉందన్నారు.సమాచార హక్కు చట్టం 2005 ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే పనితీరు,కార్యక్రమాలను తెలుసుకోవచ్చాన్నారు.వ్యక్తిగత సమాచారం మినహా,ప్రభుత్వ అధికారుల పనితీరును ప్రశ్నించే హక్కు కేవలం సమాచార హక్కు చట్టం 2005 ద్వారనే సాధ్యమన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ బాల నరసింహులు,తహసీల్దార్ సతీష్ కుమార్,ఎంపీడీఓ విజయలలిత,పాత్రికేయులు నాగప్ప,రవికుమార్, మహబూబ్ బాషా,మహేష్ గౌడ,ముద్దుసార్,నాగరాజు,యువకులు పెద్దహ్యట మల్లయ్య,మల్లి,వేణు,కృష్ణ,గాది,పంపా తదితరులు పాల్గొన్నారు.