
రాజంపేటలో దొంగల బీభత్సం
5 లక్షల విలువైన బంగారం చోరీ
రాజంపేట, న్యూస్ వెలుగు; రాజంపేటమండలపరిధిలోని బోనగిరిపల్లి ఆర్చి సమీపంలోని శ్రీకృష్ణదేవ రాయలు నగర్ లో ఓ ఇంట్లో గత రాత్రి చోరీ జరిగింది.ముదాం రవీ అనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు బద్దలు కొట్టి ఇంటిలోని కబోర్డులు, బీరువాలోని వస్తువులను చిందర వందర చేసి 5 లక్షల రూపాయలు విలువ చేసే 70 గ్రాములు బంగారు నగలు చోరీ చేశారు.
వాటిలో ఐదు జతల కమ్మలు, రెండు నల్లపూసల చైన్లు, ముత్యాల హారం, నక్లీసు, మూడు మూడు ఉంగరాలు చోరీకి గురైనట్లు బాధితురాలు తెలిపింది.అదేవిధంగా ఇంట్లోని సీసీ కెమెరాలు,హార్డ్ డిస్క్ కూడా దుండ గులు తమ ఆనవాళ్లు తెలియకుండా పట్టు కెళ్ళారు. చోరీ గురైన సంఘటన స్థలాన్ని పట్టణ సీఐ యల్లం రాజు, ఎస్సై ప్రసాద్ రెడ్డి, ఏఎస్ఐ రాజు, హెడ్ కానిస్టేబుల్ ఖాసిం పీరా లు క్లూస్ టీం తో సంఘటన స్థలాన్ని పరిశీలించారు.పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
పట్టణంలో ఇటీవల తరచూ దొంగతనాలు జరుగుతుందడంతో పట్టణవాసులు బెంబేలెత్తు తున్నారు.