
రాష్ట్ర కాంగ్రెస్ ఓబిసి చైర్మన్ ను సన్మానించిన సాంబశివుడు
కర్నూలు, న్యూస్ వెలుగు; రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్ర రత్న భవన్ విజయవాడలో బుధవారం జరిగిన రాష్ట్రస్థాయి ఓబిసి డిపార్ట్మెంట్ జిల్లా మరియు అసెంబ్లీ నియోజకవర్గాల చైర్మన్ ల సమావేశము జరిగినది. ఈ సమావేశమునకు కర్నూలు జిల్లా ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ డివి సాంబశివుడు కర్నూలు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల ఓబిసి చైర్మన్లతో హాజరయి రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ సొంటి నాగరాజు శాలువాతో సత్కరించి కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మురళీకృష్ణ ఎంతో ఉత్సాహంతో అధిష్టానం ఆదేశించిన కార్యక్రమాలను నిర్వహిస్తూ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీని ఐక్యతతో ముందుకు తీసుకు వెళుతున్నాడని మురళీకృష్ణ గారి నాయకత్వంలో కర్నూలు జిల్లాలో ఓబీసీ డిపార్ట్మెంటును బలోపేతం చేస్తానని, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా, రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయడమే మా ఉద్దేశమని హామీ తెలియజేశారు. రాష్ట్రం నందలి అన్ని జిల్లాల మరియు అసెంబ్లీ నియోజకవర్గాల ఓబిసి డిపార్ట్మెంట్ చైర్మన్లు హాజరయ్యారు.