
బీసీ హెచ్ డబ్ల్యూఓస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడుగా సత్యనారాయణ రాజు ఎన్నిక
కర్నూలు న్యూస్ వెలుగు: బిసి సంక్షేమ శాఖ వసతి గృహ సంక్షేమాధికారుల సంఘం జిల్లా ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి నగరం లోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా సత్యనారాయణ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం సత్యనారాయణ రాజు మాట్లాడుతూ జిల్లాలోని బీసీ వసతి గృహాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా వసతి గృహ సంక్షేమాధికారులందరూ ఐకమత్యంగా విధులు నిర్వహించాలన్నారు. సంక్షేమ హాస్టల్లో అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం, బిసి సంక్షేమ శాఖ వసతి గృహ సంక్షేమాధికారుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. జిల్లాలో ఏ సంక్షేమ అధికారికైనా సమస్య వచ్చిన సంక్షేమ శాఖ వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం అందరికీ అందుబాటులో ఉంటుందని అన్నారు. నాపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్షులుగా మూడోసారి ఎన్నుకున్నందుకు జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ అధికారులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.