ఆర్కే రోజాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
న్యూస్ వెలుగు, కర్నూలు; మాజీ పర్యటక శాఖ మంత్రివర్యులు ఆర్కే రోజాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని రాయలసీమ మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు అనంతరత్నం మాదిగ డిమాండ్ కర్నూల్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ శేషయ్యకి అనంత రత్నం మాదిగ లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చాడు
ఈ సందర్భంగా అనంతరత్నం మాదిగ మాట్లాడుతూ గత సంవత్సరం10/02/2023 బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ నందు ఆనాటి పర్యటకశాఖ మంత్రి రోజా బీచ్ లో చెప్పులు వదిలేసి ప్రభుత్వ ఉద్యోగి అయిన మనోహర్ ను వందల మంది సమక్షంలో మనోహర్ చెప్పులు తీసుకొని రా అని చెప్పగా మనోహర్ ఆర్కే రోజా చెప్పులు చేతపట్టుకుని వందల మంది చూస్తుండగా రోజా చెప్పులు మోస్తూ రోజా వెంబడి వెళ్తున్నాడు ఈ సంఘటన చూసిన దళితుల మనోభావాలు ఆత్మగౌరవం దెబ్బతిన్నది కావున మాజీ మంత్రివర్యులు ఆర్కే రోజాపై 24 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని మాట్లాడారు లేనిపక్షంలో దళితులంతా ఏకమై రోడ్లపైకి వస్తామని హెచ్చరించారు ఇందుకు త్రీ టోన్ శేషయ్య స్పందిస్తూ ఉన్నత అధికారులతో మాట్లాడి కేసు నమోదు చేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో నాయకంటి రాజు మాసూమ్ రవి తదితరులు పాల్గొన్నారు