
సచివాలయం సేవలను పెండింగ్ లేకుండా పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ వెలుగు; సచివాలయం ద్వారా అందిస్తున్న సేవలను పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సచివాలయం సిబ్బందిని ఆదేశించారు..బుధవారం నగరంలోని బి.క్యాంప్ లో. 56 వ వార్డు సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు..ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా సచివాలయం సిబ్బంది హాజరు పట్టికను పరిశీలిస్తూ సిబ్బంది హాజరు తో పాటు వారు నిర్వర్తిస్తున్న విధుల గురించి అడిగి తెలుసుకున్నారు… అనంతరం సేవలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.. సచివాలయం ద్వారా అందిస్తున్న సేవలను త్వరితగతిన అందించాలని, సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు.. ప్రజలకు చిత్తశుద్ధితో సేవలు అందించాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు..
Was this helpful?
Thanks for your feedback!