జీసెస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

జీసెస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

కర్నూలు, న్యూస్ వెలుగు; జీసెస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా నిర్వహకులు పలు సేవ కార్యక్రమాలు చేశారు. జీసెస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ 2000 సంవత్సరంలో స్థాపించామని వ్యవస్థాపకులు పాస్టర్ జీ.రవికుమార్ తెలిపారు. కొత్త బస్టాండ్ వద్దనున్న డాన్ బాస్కో వీధి అనాధ బాలల వసతిగృహాంలో అన్నదాన కార్యక్రమం చేశారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ ఆడిట్ అధికారి ఎస్.ఎన్.నాగరాజు పాల్గొన్నారు. ఈసందర్భంగా జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ చేసిన సేవా కార్యక్రమాలను ఆయన కొనియాడారు. ఈసందర్భంగా వసతి గృహంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈకార్యక్రమంలో జీ. రవికుమార్, జాషువా, సుధీర్ కుమార్, పాస్టర్ అనోక్,విజయ్ కుమార్, రాజేష్, కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!