
అయ్యా రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించండి : ఆర్పీఐ పార్టీ హుసేనప్ప
న్యూస్ వెలుగు డోన్ : నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఉన్న మోడల్ స్కూల్ ను పరిశీలించినట్లు ఆర్పీఐ రాష్ట్ర నాయకులూ హుస్సేనప్ప తెలిపారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ప్రజా ప్రతినిధులపై ఉందన్నది గుర్తుపెట్టుకోవాలి ఆయన అన్నారు. విద్యార్థుల కు మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమైయ్యారని వారు అన్నారు.
డోన్ మోడల్ స్కూల్ కు సీసీ రోడ్డు వేయాలని అందుకు మాజీ కేంద్ర సహాయ మంత్రి , ప్రస్తుత ఎమ్యెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి సహకరించాలని కోరారు. విద్యార్థులకు అందించాల్సిన మౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని RPI పార్టీ రాష్ట్ర నాయకులు హుస్సేనప్ప అన్నారు. ఈ కార్యక్రమంలో గే MRPS నాయకులు భూమా నాగన్న మాదిగ ఇతర నాయకులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!