పి. రుద్రవరంలో… కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం

పి. రుద్రవరంలో… కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం

న్యూస్ వెలుగు కర్నూలు: మండల కేంద్రం పి. రుద్రవరం గ్రామంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది.వందల మంది భక్తుల రామ నామ స్మరణతో గ్రామం మార్మోగింది.భక్తి పారవశ్యంతో పులకించిపోయింది. సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన త్రేతా యుగ పురుషుడు రాముడి కళ్యాణం సీతా మాతతో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ కళ్యాణం మహోత్సవానికి వైయస్సార్సిపి హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తన స్వగ్రామం అయిన పి. రుద్రవరం గ్రామం విచ్చేసి సీతారాముల వారి కళ్యాణం లో పాల్గొన్నారు. ఉదయం 9 గంటల నుంచి కల్యాణ క్రతువు ప్రారంభం కాగా 11 గంటల సమయానికి సీతారామ చంద్రుల ఉత్సవ విగ్రహాలను కళ్యాణ మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు.వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ సీతారాముల కళ్యాణం మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామప్రజలకు భక్తులకు అన్నప్రసాదం మైయస్సార్సిపి కోడుమూరు నియోజకవర్గం యూత్ వింగ్ ప్రసిడెంట్ ఎం.కె వెంకటేష్ ఏర్పాటు చేశారు. అనంతరం మైయస్సార్సిపి హిందూపురం మాజీ ఎంపీ మాట్లాడుతూ.. ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరామ నవమి గ్రామ ప్రజలు జరిపారు. ఎంత పని వత్తిడి ఉన్నా పోలీసులు గ్రామంలో ఎలాంటి అవాంఛనియ సంఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసు వ్యవస్థకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిందంగా గ్రామ ప్రజలు పాడిపంటలతో, ఆ శ్రీరాముడి ఆశిస్సులు గ్రామ ప్రజలపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!