బి.ఎడ్.కోర్సులో ఖాళీ సీట్లకు ఈ నెల 08వ తేదీ నుండి 13వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్స్,కౌన్సిలింగ్
డా.ఆర్.ఆదినారాయణ రెడ్డి,కళాశాల ప్రిన్సిపాల్
న్యూస్ వెలుగు, కర్నూలు ఎడ్యుకేషన్ : కర్నూలు నగరం,బి-క్యాంపులో గల ప్రభుత్వ బి.ఎడ్.కళాశాల (ఐఎఎస్ ఈ) నందు రెండు సంవత్సరాల బి.ఎడ్.కోర్సులో భర్తీ కాకుండా మిగిలివున్న సీట్లను భర్తీ చేయుటకు ఈ నెల 08 నుండి 13వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.ఆర్.ఆదినారాయణ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.(ఎపిఎస్ సిహెచ్ ఈ)(ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ అఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్) మార్గదర్శకాల ప్రకారం 2024 సంవత్సరంలో ఏపీఎడ్ సెట్(ఎపిఈడిసిఈటి)లో అర్హత సాధించి,2024-25విద్యా సంవత్సరంలో ఇంతవరకు ఏ కళాశాలలోనూ అడ్మిషన్ పొందని ఆసక్తి గల విద్యార్థులు తమ ఒరిజినల్ ధ్రువ పత్రాలతో హాజరై దరఖాస్తు సమర్పించి అడ్మిషన్ పొందవచ్చునని తెలియజేశారు. రిజిస్ట్రేషన్ ఫీజు,కళాశాల ఫీజు,కేటగిరి వారీగా ఖాళీల వివరాలు,ఇతర వివరాల కొరకు 9949301100 లేదా 9398698207 ను సంప్రదించాలని తెలియజేశారు.