ప్రారంభమైన శ్రీదేవీ నవరాత్రి ఉత్సవాలు
బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు
తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: మండల కేంద్రమైన తుగ్గలిలోని స్థానిక సీతారాముల దేవాలయం నందు శ్రీదేవీ నవరాత్రి ఉత్సవాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి.శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటి రోజున బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.మొదటి రోజు నవరాత్రి వేడుకలలో భాగంగా అమ్మవారిని చక్కగా పూలతో అలంకరించి,ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తాదులకు ప్రసాదాన్ని వితరణ చేశారు.గ్రామంలోని భక్తాదులు పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని వారు తమ మొక్కలను తీర్చుకున్నారు.ఈ కార్యక్రమంలో అర్చకులు వీరేష్,శ్రీ దుర్గా దేవి కమిటీ నిర్వాహకులు హోటల్ రామాంజి,వడ్డే బ్రహ్మయ్య,మోహన్,కోట్ల సూరి,మాభాష,శ్రీకాంత్,సమీర్,నభి, కమిటీ సభ్యులు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.